మెగాస్టార్ అభిమానులకు గుడ్‌న్యూస్. త్వరలో చిరు, బాబీ కాంబినేషన్లో ఓ కొత్త సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది. ప్రముఖ నిర్మాణ సంస్థ మైత్రి మూవీ మేకర్స్. బ్యానర్‌పై మెగాస్టార్ 154వ సినిమా తెరకెక్కుతోంది. దీనికి సంబంధించిన ఓ పోస్టర్‌ను ట్విట్టర్లో పంచుకుంది చిత్రబృందం. ఇందులో చిరంజీవి చేతిలో లంగరు ఉంది.
వచ్చే ఏడాది సంక్రాంతికి ఈ సినిమా థియేటర్లలో అలరించనుంది. ఇందులో చిరు సరసన శ్రుతిహాసన్ నటిస్తున్నారు. ఈ సినిమా టైటిల్, టీజర్ త్వరలోనే ప్రకటించనున్నట్లు పోస్టర్లో మూవీ టీమ్ పేర్కొంది.
