త్వరలో జరగనున్న రాష్ట్రపతి ఎన్నికల్లో విపక్ష పార్టీల తరపున బరిలోకి దిగుతున్న అభ్యర్థి యశ్వంత్ సిన్హాకు కేంద్ర ప్రభుత్వం జడ్ కేటగిరి భద్రత కల్పించింది. రాష్ట్రపతి ఎన్నికల్లో విపక్షాల ఉమ్మడి అభ్యర్థిగా పోటిచేస్తున్న సిన్హాకు కేంద్ర హోంఖ సీఆర్పీఎఫ్ సాయుధ కమాండోల రక్షణ కల్పించింది.
యశ్వంత్ సిన్హా ఈ నెల 27న నామినేషన్ దాఖలు చేయనున్నారు. రాజ్యసభ సెక్రటరీ జనరల్‌కు తన నామపత్రాలను సర్పించనున్నారు. కాంగ్రెస్, ఎన్సీపీ, టీఎంసీ, సమాజ్‌వాదీ పార్టీ సహా 22 పార్టీలు సిన్హాకు మద్దతు తెలిపాయి.