ఏపీలోని కోనసీమ జిల్లాను అంబేడ్కర్ కోనసీమగా పేరు మార్చేందుకు కేబినెట్ ఆమోదం తెలిపింది. సీఎం జగన్ ఆధ్వర్యంలో జరిగిన మంత్రివర్గ సమావేశంలో పలు కీలక నిర్ణయాలు తీసుకున్నారు. ఇందుకు సంబంధించిన పీఆర్సీ జీవోలో మార్పులకు మంత్రివర్గం ఆమోదముద్ర వేసింది.
ఈ నెల 27న అమ్మఒడి పథకానికి నిధులు విడుదల చేయనున్నారు. దీంతోపాటు విద్యాకానుక, వాహనమిత్ర, జగనన్నతోడు, కాపు నేస్తం సంక్షేమ పథకాలను వచ్చే నెల నుంచి అమలు చేయనున్నారు. వంశధార నిర్వాసితులకు రూ.216 కోట్ల పరిహారం నిధులు విడుదల చేయడంతో పాటు అర్జున అవార్డు గ్రహీత జ్యోతి సురేఖకు గ్రూప్-1 ఉద్యోగం ఇచ్చేందుకు కేబినేట్ ఆమోదం తెలిపింది.
