Home / NATIONAL / శివసేనకు కొత్త ఏమి కాదు-గతంలో ఎన్ని సార్లు అంటే..?

శివసేనకు కొత్త ఏమి కాదు-గతంలో ఎన్ని సార్లు అంటే..?

మహారాష్ట్ర అధికార పార్టీ శివసేనలో  రోజురోజుకూ మారుతున్న రాజకీయ పరిణామాలు ఉత్కంఠను కలిగిస్తున్నాయి. శివసేనకి చెందిన నేత, ఆ రాష్ట్ర మంత్రి ఏక్‌నాథ్‌ షిండే వర్గం తిరుగుబావుటాతో సీఎం ఉద్ధవ్‌ ఠాక్రే సంకీర్ణ ప్రభుత్వం మహావికాస్‌ అఘాడీ (ఎంవీఏ) కూటమి కూలిపోయే ప్రమాదంలో ఉంది. పార్టీ ఫిరాయింపుల నిరోధక చట్టం ప్రకారం తనపై చర్యల నుంచి తప్పించుకోవాలంటే షిండే వెంట పార్టీకి చెందిన మొత్తం ఎమ్మెల్యేల్లో 2/3 వంతు (37 మంది) సభ్యులు ఉండాలి. అయితే, గువాహటిలోని షిండే క్యాంపులో దాదాపు 40 మంది ఎమ్మెల్యేలు ఉన్నట్టు సమాచారం. కాగా, ఆరు దశాబ్దాల చరిత్ర కలిగిన శివసేన పార్టీకి ఇలాంటి సంకట పరిస్థితి ఎదుర కావడం ఇదే తొలిసారి కాదు. గతంలో మూడు సార్లు శివసేన రాజకీయ సంక్షోభ పరిస్థితులను ఎదుర్కొన్నది. అవి ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం మరి

గతంలో కుదుపులు
1991-పార్టీలో మనోహర్‌ జోషికి ప్రాధాన్యం ఇవ్వడాన్ని సహించలేకపోయిన చగన్‌ భుజ్‌బాల్‌ తనకు మద్దతుగా ఉన్న 18 మంది ఎమ్మెల్యేలతో (అప్పుడు పార్టీ మొత్తం బలం 52 మంది ఎమ్మెల్యేలు) శివసేనపై తిరుగుబావుటా ఎగురవేశారు. శివసేన-బీ పేరిట కొత్త పార్టీకి ప్రయత్నాలు ముమ్మరం చేశారు. ఈ మేరకు తమ రాజీనామాలను స్పీకర్‌కు అందజేశారు. దీంతో బాల్‌ఠాక్రే భుజ్‌బాల్‌ను పార్టీ నుంచి సస్పెండ్‌ చేశారు. అయితే, అదేరోజు 12 మంది ఎమ్మెల్యేలు శివసేనలో చేరారు. భుజ్‌బాల్‌ కాంగ్రెస్‌లో చేరారు.

2005: ఉద్ధవ్‌ ఠాక్రే తన రాజకీయ జీవితాన్ని ప్రభావితం చేస్తున్నారని జూలైలో నారాయణ్‌ రాణె 40 మంది ఎమ్మెల్యేలతో పార్టీకి వ్యతిరేకంగా క్యాంప్‌ పెట్టారు. అయితే, రాణె వ్యూహాన్ని శివసేన కొంతవరకూ చేధించి రెబల్స్‌లోని 28 మంది ఎమ్మెల్యేల మద్దతును మళ్లీ కూడగట్టగలిగింది. మిగతా 12 మందిని సస్పెండ్‌ చేసింది. దీంతో రాణె సహా వీరంతా కాంగ్రెస్‌లో చేరారు.

2006: పార్టీలో కొందరి పెత్తనం పెరిగిపోయిందని బాల్‌ఠాక్రే మేనల్లుడు రాజ్‌ఠాక్రే పార్టీని వీడా రు. శివసేనలో చీలిక తప్పదని, తన వెంట ఎంపీ లు, ఎమ్మెల్యేలు ఉన్నారని పేర్కొన్నారు. మహారాష్ట్ర నవ్‌నిర్మాణ్‌ సేన పేరిట పార్టీ పెట్టారు.

MOST RECENT

Facebook Page

canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat