సోమర్‌సెట్‌తో జరిగిన మ్యాచ్‌లో టీ20 విటాలిటీ బ్లాస్ట్ క్రికెట్ లీగ్‌లో సర్రే జట్టు అద్భుత విజయాన్ని నమోదు చేసింది. చివరి ఓవర్‌లో సర్రే జట్టు 9 రన్స్ చేయాల్సి ఉంది. అయితే ఆ ఓవర్ ఓ థ్రిల్లర్‌లా సాగింది. 145 రన్స్ టార్గెట్‌తో బరిలోకి దిగిన సర్రే జట్టు 19 ఓవర్లలో 4 వికెట్లు కోల్పోయి 136 రన్స్ చేసింది.
చివరి ఓవర్‌లో 9 రన్స్ కావాల్సిన సమయంలో ఆస్ట్రేలియా ఫాస్ట్ బౌలర్ పీటర్ సిడిల్‌కు బౌలింగ్ అప్పగించారు. తొలి బంతికి ఒక రన్ వచ్చింది. రెండవ బంతికి జోర్డాన్‌ను ఔట్ చేశాడు. ఇక మూడవ బంతిని నికో రీఫర్ ఓ బౌండరీ కొట్టాడు. ఆ తర్వాత నాలుగవ బంతికి అతను ఔట్ అయ్యాడు.
ఆ తర్వాత అయిదో బంతికి గస్ అట్కిన్‌సన్ ఔట్ అయ్యాడు. దీంతో మ్యాచ్‌లో టెన్షన్ పెరిగింది. ఆఖరి బంతికి 4 రన్స్ కావాలి. కానీ బౌలర్ సిడిల్ టాప్ ఫామ్‌లో ఉన్నాడు. అయితే చివరి బంతిని కానర్ మెక్‌కీర్ ఎక్స్‌ట్రా కవర్‌లో బౌండరీకి తరలించాడు. దీంతో సర్రే జట్టు థ్రిల్లింగ్ రీతిలో ఆ మ్యాచ్‌ను నెగ్గేసింది. ఆ ఓవర్ వీడియోను మీరూ చూడండి.
9️⃣ runs to win from the final over…
What happens next is just ?#Blast22 pic.twitter.com/PMI0HXMdw9
— Vitality Blast (@VitalityBlast) June 21, 2022