తమిళనాడుకు చెందిన సీనియర్నటుడు, డీఎండీకే అధ్యక్షుడు విజయ్‌కాంత్ కాలికి సర్జరీ జరిగింది. గతకొంతకాలంగా షుగర్ వ్యాధితో బాధపడుతున్న ఆయన కాలికి ఇన్ఫెక్షన్ సోకడంతో వైద్యులు సర్జరీ చేయాల్సి వచ్చింది.
కాలుకి రక్త సరఫరా కాకపోవడంతో అత్యవసరంగా మూడు కాలి వేళ్లను తొలగించారు. ఈ మేరకు డీఎండీకే వర్గాలు వెల్లడించాయి. ప్రస్తుతం ఆయన ఆరోగ్యం బాగానే ఉందని.. రెండు మూడురోజుల్లో విజయ్‌కాంత్ డిశ్చార్జ్ అవుతారని తెలిపాయి.