ఓ ఎస్సై దుండగుడితో పోరాడి అతడిని నిలువరించిన తీరు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఈ ఘటన కేరళలో జరిగింది. అలప్పుజ జిల్లా కాయంకులమ్ వద్ద పెట్రోలింగ్ నిర్వహిస్తున్న పోలీసులకు ఓ వ్యక్తి అనుమానాస్పదంగా కనిపించాడు.
అతడి ముందు పోలీసులు జీపు ఆపే ప్రయత్నం చేశారు. ఎస్సై అరుణ్‌కుమార్ కిందికి దిగుతుండగా.. దుండగుడు గమనించి వెంటన తన బైక్‌లో ఉంచి కత్తిని బయటకు తీసి ఎస్సైపైకి దాడికి యత్నించాడు. వెంటనే ఎస్సై అతడిని వీరోచితంగా నిలువరించి కత్తిని లాక్కున్నారు. ఈ దృశ్యాలు సమీపంలోని సీసీ కెమెరాలో రికార్డయ్యాయి. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. దుండగుడిని చాకచక్యంగా నిలువరించిన ఎస్సైను పలువురు ప్రశంసిస్తున్నారు.