ఈ నెల 19న ఫాదర్స్‌డే సందర్భంగా టీఎస్ఆర్టీసీ బంపర్ ఆఫర్ ప్రకటించింది. ఐదేండ్ల లోపు పిల్లలతో కలిసి ప్రయాణించే తల్లిదండ్రులకు అన్ని బస్ సర్వీస్‌ల్లో ఆ ఒక్కరోజు ఉచిత ప్రయాణం కల్పిస్తున్నట్టు ఆర్టీసీ ఛైర్మన్ బాజిరెడ్డి గోవర్ధన్, ఎండీ సజ్జనార్ శుక్రవారం ఓ ప్రకటనలో తెలిపారు.
