టాలీవుడ్ ఇండస్ట్రీకి చెందిన హీరోయిన్ ముధుశాలిని చడి చప్పుడు లేకుండా వివాహం చేసుకుని సినీ ప్రేక్షకులను,తన అభిమానులను సర్‌ప్రైజ్ చేసింది. కోలీవుడ్ హీరో గోకుల్ ఆనంద్‌ను, మధుశాలిని పెళ్ళి చేసుకుంది. గురువారం రోజు హైదరాబాద్‌లో ఇరుకుటుంబ సభ్యులు, సన్నిహితుల మధ్య వీరి వివాహం ఘనంగా జరిగింది.
పలువురు టాలీవుడ్, కోలీవుడ్ సినీప్రముఖులు పెళ్ళికి హజరై నూతన వధూవరులను ఆశీర్వదించారు. 2019లో వచ్చిన ‘పంచాక్షరం’ అనే తమిళ సినిమాలో వీరిద్దరూ కలిసి నటించారు. షూటింగ్ సమయంలోనే వీరిరువురు ప్రేమలో పడ్డారట. మూడేళ్ళ తర్వాత మూడు ముళ్ళ బంధంతో ఈ జంట ఒక్కటయ్యారు.
మధుశాలిని హైదరాబాద్‌లోని ఓ ప్రముఖ బిజినెస్ మ్యాన్ కుతురు. మెగా స్టార్ ..సీనియర్ స్టార్ హీరో.. చిరంజీవి ‘అందరివాడు’ చిత్రంతో సినీరంగంలోకి ప్రవేశించింది. అనతికాలంలోనే వరుస అవకాశాలతో బిజీగా మారిపోయింది. ‘ఒకVచిత్రం’, ‘కితకితలు’, ‘గోపాల గోపాల’, ‘అనుక్షణం’, ‘గూఢచారి’, వంటి చిత్రాలతో మంచి నటిగా గుర్తింపు తెచ్చుకుంది. ఇటీవలే ఈమె నటించిన ‘9 అవర్స్’ వెబ్ సిరీస్ హాట్‌స్టార్‌లో విడుదలై పాజిటీవ్ రివ్యూలను తెచ్చుకుంది. ప్రస్తుతం వీళ్ళ ఫోటోలు నెట్టింట వైరల్‌గా మారాయి.