‘అగ్నిపథ్’ పేరుతో కేంద్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయంతో దేశమంతా అట్టుడికిపోతోందని తెలంగాణ మంత్రి హరీష్‌రావు విమర్శించారు. నిజామాబాద్ జిల్లా మోతెలో పీహెచ్సీ ప్రారంభించిన సందర్భంగా నిర్వహించిన కార్యక్రమంలో ఆయన మాట్లాడారు.
సికింద్రాబాద్‌లో జరిగిన అల్లర్లను టీఆర్ఎస్ చేయించిందంటూ బండి సంజయ్చేసిన ఆరోపణలపై హరీష్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. సికింద్రాబాద్‌లో టీఆర్ఎస్ చేయిస్తే యూపీలో పోలీస్‌స్టేషన్‌పై దాడి ఎవరు చేశారని సూటిగా ప్రశ్నించారు. అగ్నిపథ్ విధానం యువకులకు అర్థం కాలేదంటూ కేంద్ర ప్రభుత్వం వ్యాఖ్యానించడం హాస్యాస్పదమన్నారు. బీజేపీ ప్రతి ఒక్కరి ఉసురు పోసుకుంటోందని.. ఆర్మీని కూడా ప్రైవేట్ పరం చేయాలని చూస్తోందని ఆగ్రహం వ్యక్తం చేశారు.