బీజేపీ నేతలు మాట్లాడితే విషం చిమ్ముతున్నారని.. హిందూ ముస్లిం మాటలతో ప్రజల్ని రెచ్చగొడుతున్నారని టీఆర్‌ఎస్ వర్కింగ్‌ప్రెసిడెంట్, మంత్రి కేటీఆర్ విమర్శించారు. తెలంగాణ ప్రాంతం సుభిక్షంగా ఉందని, ఎవరెన్ని కూతలు కూసినా పట్టించుకోవద్దని ప్రజలకి సూచించారు. నాగర్‌కర్నూల్ జిల్లా కొల్లాపూర్ వివిధ అభివృద్ధి పనులకు శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు చేసిన అనంతరం నిర్వహించిన సభలో కేటీఆర్ మాట్లాడారు.
కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం తన అనాలోచితమైన నిర్ణయాలతో దేశాన్ని రావణకాష్టంగా మార్చేసిందని తీవ్రస్థాయిలో ఆయన ఆరోపించారు. కులపిచ్చోడు, మత పిచ్చోడు మనకొద్దని.. అభివృద్ధి, సంక్షేమానికి అండగా నిలిచేవాళ్లే కావాలని చెప్పారు. టీఆర్‌ఎస్‌ప్రభుత్వం అభివృద్ధి, సంక్షేమమే లక్ష్యంగా పాలన చేస్తోందని చెప్పారు.