దేశంలో వారం రోజులుగా కరోనా కేసులు రోజురోజుకు పెరుగుతున్నాయి. కొత్తగా 13,216 మంది వైరస్ బారినపడ్డారు. దీంతో మొత్తం కేసులు 4,32,83,793కు చేరుకున్నాయి. ఇందులో 4,26,90,845 మంది బాధితులు కోలుకున్నారు. ఇప్పటివరకు 5,24,840 మంది మరణించారు.
మరో 68,108 కేసులు యాక్టివ్‌గా ఉన్నాయి. కాగా, గత 24 గంటల్లో 23 మంది బాధితులు కరోనాకు బలవగా, 8148 మంది డిశ్చార్జీ అయ్యారు.కొత్తగా నమోదైన కేసుల్లో అత్యధికంగా మహారాష్ట్రలో 4,165 కేసులు నమోదవగా, కేరళలో 3,162, ఢిల్లీలో 1,797, హర్యానాలో 689, కర్ణాటకలో 634 మందికి కరోనా పాజిటివ్ వచ్చింది.