కుత్బుల్లాపూర్ నియోజకవర్గం, జీడిమెట్ల 132 డివిజన్ పరిధిలోని మహానగర్ ఎస్టేట్ కాలనీకి చెందిన వెల్ఫేర్ అసోసియేషన్ సభ్యులు ఈరోజు ఎమ్మెల్యే కేపి వివేకానంద్ గారిని తన నివాసం వద్ద కార్యాలయంలో మర్యాదపూర్వకంగా కలిశారు.
ఈ సందర్భంగా తమ కాలనీలో ఉన్న పాత డ్రైనేజీ లైన్ ను మార్చి నూతన లైన్ ఏర్పాటు చేసేలా కృషి చేయాలని కోరుతూ ఎమ్మెల్యే గారికి వినతి పత్రాన్ని అందజేశారు. ఈ మేరకు ఎమ్మెల్యే గారు సానుకూలంగా స్పందించి వెంటనే సంబంధిత అధికారులతో ఫోన్ లో మాట్లాడారు. అందుకు చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. ఈ కార్యక్రమంలో ప్రెసిడెంట్ నార్లకంటి కుమార్, వైస్ ప్రెసిడెంట్ రవీందర్ నాయక్, జనరల్ సెక్రెటరీ వెంకట్ రామ్ రెడ్డి, జాయింట్ సెక్రటరీ కవిరాజు తదితరులు పాల్గొన్నారు.