సమస్యల పరిష్కారమే పట్టణ ప్రగతి లక్ష్యం అని ఎమ్మెల్యే కేపి వివేకానంద్ గారు పేర్కొన్నారు. ఈ మేరకు కుత్బుల్లాపూర్ నియోజకవర్గం, సుభాష్ నగర్ 130 డివిజన్ పరిధిలోని భాగ్య లక్ష్మి కాలనీ, జేకే నగర్ లలో చేపట్టిన పట్టణ ప్రగతిలో ఈరోజు ఎమ్మెల్యే కేపి వివేకానంద్ గారు పాల్గొన్నారు. ఈ సందర్భంగా పాదయాత్ర చేసి స్థానిక సమస్యలు తెలుసుకున్నారు.
కాగా రూ.80 లక్షలతో డ్రైనేజీ నిర్మాణ పనులు పూర్తయిన వెంటనే తమకు ఇబ్బందులు లేకుండా సీసీ రోడ్లు పూర్తి చేయించాలని, కమిటీ హాల్ ఏర్పాటు, వీధి ద్వీపాలు, పోలీస్ పాట్రోలింగ్ వంటి సమస్యలు ఎమ్మెల్యే గారి దృష్టికి తీసుకువచ్చారు. అనంతరం ఏర్పాటు చేసిన సమావేశంలో డ్రైనేజీ వ్యవస్థ అభివృద్ధి చేసిన వెంటనే రోడ్లు పూర్తి చేయాలని అక్కడే ఉన్న అధికారులను ఎమ్మెల్యే గారు ఆదేశించారు.
మిగిలిన సమస్యలు నోట్ చేసుకొని వేగంగా పరిష్కరించేలా చర్యలు తీసుకోవాలని సూచించారు. ఈ కార్యక్రమంలో డిసి మంగతాయారు, ఈఈ కృష్ణ చైతన్య, వాటర్ వర్క్స్ డిజిఎం రాజేష్, స్థానిక డివిజన్ టీఆర్ఎస్ పార్టీ అధ్యక్షుడు పోలె శ్రీకాంత్, కాలనీ ప్రెసిడెంట్ సాగర్ రెడ్డి, జనరల్ సెక్రెటరీ యాదగిరి యాదవ్, నాయకురాలు అరుణ రెడ్డి, పద్మజ రెడ్డి, రామ్మోహన్ రావు, పందిరి యాదగిరి, ఏరియా కమిటీ సభ్యుడు అడప శేషు, వాజిర్, ఇస్మాయిల్ తదితరులు పాల్గొన్నారు.