తెలంగాణలో ఉపాధ్యాయుల బదిలీలకు లైన్ క్లియరైంది. పదోన్నతులు లేకుండా కేవలం బదిలీలకే అవకాశం కల్పిస్తామని పదోన్నతుల అంశం కోర్టు పరిధిలో ఉండటంతో న్యాయ సలహా మేరకు బదిలీలు మాత్రమే నిర్వహిస్తామని బుధవారం సంఘ నేతలతో అధికారుల సమావేశం జరిగింది అని విశ్వసనీయ సమాచారం. ఇందులో భాగంగా వివిధ అంశాలపై చర్చించిన తర్వాత బదిలీలు మాత్రమే నిర్వహించాలని నిర్ణయం తీసుకున్నారు. బదిలీలు మాత్రం జూన్ మూడో వారంలోనే నిర్వహించాలని.. ఈ నెల 21 నుంచి బదిలీల ప్రక్రియ ప్రారంభించి 30వ తేదీలోగా ముగించాలని నిర్ణయం తీసుకున్నారు. ఈ మేరకు ఉత్తర్వులు వెలువడాల్సి ఉంది.
పరిశీలకులుగా సీనియర్ అధికారులు..
టీచర్ల బదిలీలను ఆన్‌లైన్ పద్ధతిలోనే నిర్వహించనున్నారు. బదిలీల ప్రక్రియను సజావుగా నిర్వహించేందుకు పాత జిల్లాలకు సీనియర్ అధికారులను పరిశీలకులుగా నియమిస్తారు. శనివారం నుంచి వారు జిల్లా అధికారులతో సమావేశమై ఉపాధ్యాయ ఖాళీలను ఖరారు చేస్తారు. వీటిపై అభ్యంతరాలను స్వీకరించిన తర్వాత తుది జాబితాను ప్రకటిస్తారని. ఉమ్మడి జిల్లాల్లోని సంఘాల ప్రతినిధులకు మాత్రమే పాయింట్లు ఇవ్వనున్నట్లు తెలిసింది.
బదిలీల షెడ్యూల్ కూడా క్రింద తెలిపిన విధంగా ఉండే అవకాశం ఉన్నట్లు సంఘ నాయకులు తెలిపారు
21,22 తేదీల్లో వెబ్‌సైట్‌లో ఖాళీల జాబితా ప్రదర్శన
23న ఖాళీల జాబితాపై అభ్యంతరాల స్వీకరణ
24 న ఖాళీల తుది జాబితా విడుదల
25-26 వరకు దరఖాస్తుల స్వీకరణ
27-28 తేదీల్లో దరఖాస్తుల పరిశీలన
29 న దరఖాస్తుల్లో సవరణకు చాన్స్
30వ తేదీ న బదిలీ స్థానం కేటాయింపు మరియు కౌన్సెలింగ్ పూర్తి