రానున్న సంవత్సరకాలంలో దేశవ్యాప్తంగా మొత్తం 1,48,463 నియామకాలను పూర్తి చేస్తామని రైల్వే శాఖ తెలిపింది. గత ఎనిమిదేళ్లలో ఏడాదికి సగటున 43,678 కొత్తగా ఉద్యోగాలిస్తున్నామని వెల్లడించింది. 2014-15 నుంచి 2021-22 వరకు మొత్తం 3,49,422 మందికి ఉద్యోగాలిచ్చామ్ము.
2022-23లో మరో 1,48,463 నియామకాలు చేపడతామని స్పష్టం చేసింది. మోడ్రన్ టెక్నాలజీ అందుబాటులోకి వచ్చిన నేపథ్యంలో గ్రూప్ సి, డి పోస్టులు భర్తీ చేయాల్సిన అవసరం లేదని పేర్కొంది.