సినిమా ఇండస్ట్రీలో తనను కనిపించకుండా చేస్తానని తెలుగు సినిమా ఇండస్ట్రీకి చెందిన ఓ ప్రొడ్యూసర్ బెదిరించారని హీరోయిన్ చాందినీ చౌదరి ఆలీతో సరదాగా కార్యక్రమంలో తెలిపింది. ‘నీకు అన్యాయం జరుగుతున్నప్పుడు ఇండస్ట్రీలో ఉన్న పెద్ద వాళ్ల దగ్గరకు ఎందుకు వెళ్లలేదు’ అని ఆలీ అడగాడు. అయితే తనని తాను బ్యాకప్ చేసుకోవడానికి ఇక్కడ ఎవరూ లేరు.. వాళ్లు తలుచుకుంటే చిటికేసి మసి చేసేస్తారు కదాని ఆవేదన వ్యక్తం చేసింది. హీరో కిరణ్ అబ్బవరంతో కలిసి ఆలీషోకు హాజరైంది.