కుత్బుల్లాపూర్ నియోజకవర్గం, చింతల్ 128 డివిజన్ పరిధిలోని శ్రీనివాస్ నగర్, వివేకానంద్ నగర్, ఎన్.ఎల్.బి నగర్, రొడామేస్త్రి నగర్ లలో పట్టణ ప్రగతి కార్యక్రమంలో భాగంగా ఈరోజు ఎమ్మెల్యే కేపి వివేకానంద్ గారు మొక్కలు నాటారు. అనంతరం శ్రీనివాస్ నగర్ కమిటీ హాల్ వద్ద ఏర్పాటు చేసిన సమావేశంలో పాల్గొని స్థానిక సమస్యలు తెలుసుకున్నారు. ఈ మేరకు ఆయా కాలనీల్లో మిగిలి ఉన్న డ్రైనేజీలు, మంచినీటి లైన్లు పూర్తి చేయాలని ఎమ్మెల్యే గారిని కోరారు.
హైమాస్ట్ లైట్, వీధి ద్వీపాలు, కరెంటు స్తంభాలు, పోలీస్ పాట్రోలింగ్, ప్రమాదాలు జరగకుండా ట్రాన్స్ఫార్మర్ దిమ్మె ఎత్తు పెంచాలని, మహిళా భవనం, ఫంక్షన్ హాల్ వంటి సమస్యలను ఎమ్మెల్యే గారి దృష్టికి తీసుకురాగా.. అక్కడే ఉన్న సంబంధిత అధికారులకు ఆయా సమస్యలను నోట్ చేసుకొని వేగవంతంగా పరిష్కరించేలా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. ఇప్పటికే నాలుగు కాలనీల్లో సీసీ రోడ్ల ఏర్పాటుకు రూ.1.52 కోట్ల నిధులు మంజూరయ్యాయని ఆయా పనులు వేగంగా పూర్తి చేయిస్తానని చెప్పారు.
మహిళా భవనం, ఫంక్షన్ హాల్ కు త్వరలోనే నిధులు కేటాయించి పూర్తి చేసేలా కృషి చేస్తానని ఎమ్మెల్యే గారు హామీ ఇచ్చారు. ప్రజల మధ్యకు నేరుగా వెళ్లి సమస్యలు తెలుసుకొని వాటిని పరిష్కరించడమే పట్టణ ప్రగతి లక్ష్యం అన్నారు. పట్టణ ప్రగతిలో ప్రజలంతా భాగస్వాములు కావాలని అన్నారు. ఈ కార్యక్రమంలో డిసి రవీందర్, జీఎం శ్రీధర్ రెడ్డి, ఈఈ గోవర్ధన్, డిజిఎం అప్పల నాయుడు మరియు మాజీ జడ్పీవైస్ చైర్మన్ ప్రభాకర్ రెడ్డి, మాజీ మున్సిపల్ వైస్ చైర్మన్ తంగ లక్ష్మారెడ్డి, నాయకులు బస్వరాజ్, కృష్ణ మూర్తి, వెంకటేష్ గౌడ్, ప్రభాకర్ గుప్త, చలమారెడ్డి, ప్రకాష్, డివిజన్ మహిళా అధ్యక్షురాలు స్వప్న, నాయకురాలు విజయ లక్ష్మీ, స్వర్ణలత, వార్డు మెంబర్ వహీద్ ఖురేషి, కాలనీ సంక్షేమ సంఘం సభ్యులు ప్రసాద్, ఆంజనేయులు, సాయి, శ్రీకాంత్ తదితరులు పాల్గొన్నారు.