దేశ కోసం ప్రాణాలర్పించిన కల్నల్ సంతోష్ బాబుచరిత్రలోనే చిరస్మరణీయుడిగా నిలిచి పోతారని విద్యుత్ శాఖ మంత్రి గుంటకండ్ల జగదీష్ రెడ్డి అన్నారు. భారత్-చైనా సరిహద్దుల్లో జరిగిన యుద్ధంలో అసువులు బాసిన మహావీరచక్ర దివంగత కల్నల్ సంతోష్ బాబు రెండో వర్ధంతి సందర్భంగా సంతోష్ బాబు చిత్రపటానికి మంత్రి ఘన నివాలులర్పించారు.కాసరబాద్ రోడ్డులోని స్మృతి వనంలొ కుటుంబ సభ్యులు ఏర్పాటు చేసిన సంతోష్ బాబు విగ్రహాన్ని మంత్రి జగదీష్ రెడ్డి ఆవిష్కరించారు. అనంతరం మంత్రి మాట్లాడుతూ.. సంతోష్ బాబు మరణానంతరం ముఖ్యమంత్రి కేసీఆర్ అందించిన సహాయ సందేశం ఇతర రాష్ట్రాల తో పాటు యావత్ భారతదేశానికి స్ఫూర్తివంతమైన సందేశాన్ని చేరవేసిందన్నారు.
