తెలంగాణలో కరోనా కేసులు భారీగా పెరుగుతున్నాయి. గడిచిన 24 గంటల్లో రాష్ట్ర వ్యాప్తంగా 22,662 కరోనా టెస్టులు చేశారు.. ఇందులో కొత్తగా 219 కరోనా కేసులు నమోదయ్యాయి. ఫిబ్రవరి తర్వాత ఈ స్థాయిలో కేసులు నమోదు కావడం ఇదే తొలిసారి కాగా.. తాజా కేసుల్లో 164 కేసులు హైదరాబాద్లోనే నమోదయ్యాయి. ప్రస్తుతం రాష్ట్రంలో 1259 యాక్టివ్ కేసులు ఉన్నాయి.
