లీటర్ పెట్రోల్ కేవలం రూ.54 మాత్రమే. ఎప్పుడో పెట్రోల్ రేట్ సెంచరీ దాటేస్తే.. ఇంత తక్కువకేంటీ అని ఆశ్చర్యపోతున్నారా? మీరు చదివింది నిజమేనండీ బాబూ! మహారాష్ట్రలోని ఔరంగాబాద్‌లో ఓ బంక్‌లో ఈరోజంతా అదే రేటుకు పెట్రోల్ అమ్మారు.
మహారాష్ట్ర నవ నిర్మాణ్‌సేన అధ్యక్షుడు రాజ్ ఠాక్రే బర్త్‌డే సందర్భంగా ఆయన అభిమానులు ఈ ఏర్పాటు చేశారు. ఔరంగాబాద్‌లోని క్రాంతి చౌక్ పెట్రోల్ బంక్‌లో రూ.54కే లీటర్ పెట్రోల్ అందజేశారు. దీంతో భారీగా వాహనదారులు అక్కడికి క్యూ కట్టారు. ఈ బంపర్ ఆఫర్ ఈ ఒక్కరోజుకే ఇచ్చారు.