టీమిండియాకు చెందిన మాజీ క్రికెటర్లు, అంపైర్ల విషయంలో బీసీసీఐ కీలక నిర్ణయం తీసుకుంది. వారికి ఇచ్చే పెన్షన్స్ను పెంచుతున్నట్లు ప్రకటించింది. కనిష్ఠంగా రూ.15వేలు ఉన్న పెన్షన్ను రూ.30 వేలకు.. గరిష్ఠంగా రూ.50 వేలు ఉన్న పెన్షన్ ను రూ.70 వేలకు పెంచింది.
5 కేటగిరీలుగా ఈ పెన్షన్ అందిస్తారు. జూన్ 1 నుండి పెన్షన్ పెంపు అమల్లోకి వస్తుంది. బీసీసీఐ తీసుకున్న ఈ నిర్ణయంతో 900 మంది మాజీ క్రికెటర్లు, అంపైర్లకు లబ్ధి చేకూరనుంది.