ఇంగ్లండ్ క్రికెట్ జట్టుకు చెందిన సీనియర్ పేసర్ జేమ్స్ ఆండర్సన్ టెస్టు క్రికెట్లో అరుదైన ఘనత సాధించాడు. తన కెరీర్లో 650వ టెస్టు వికెట్ మైలురాయిని చేరుకున్నాడు. న్యూజిలాండ్ జట్టుతో జరుగుతున్న రెండో టెస్టులో లాథమ ను ఔట్ చేసి ఆండర్సన్ ఈ ఘనత సాధించాడు. టెస్టుల్లో 650 వికెట్లు పడగొట్టిన మూడో బౌలర్ ఆండర్సన్ రికార్డులకెక్కాడు. స్పిన్ దిగ్గజాలు షేన్ వార్న్, మురళీధరన్ ఈ అరుదైన ఘనత సాధించిన జాబితాలో తొలి రెండు స్థానాల్లో ఉన్నారు.
