కాంగ్రెస్ పార్టీ ఆశాకిరణం ,ఎంపీ, ఆ పార్టీ మాజీ జాతీయ అధ్యక్షుడు రాహుల్ గాంధీ ఈ రోజు సోమవారం ఈడీ ఆఫీసుకు హజరయిన సంగతి విధితమే. అందులో భాగంగా ఈ రోజు ఆ పార్టీ శ్రేణులతో కల్సి ఆయన భారీ ర్యాలీతో ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరక్టరేట్(ఈడీ) ఆఫీసుకు ర్యాలీతో వెళ్లారు. కొన్ని వేల సంఖ్యలో కాంగ్రెస్ పార్టీ మద్దతుదారులు ఈ ర్యాలీలో పాల్గొన్నారు.
నేషనల్ హెరాల్డ్ కేసులో విచారణను ఎదుర్కొనేందుకు ఆయన ఈడీ ఆఫీసుకు వెళ్లారు. ఈడీ తీరును ఖండిస్తూ సెంట్రల్ ఢిల్లీలో కొందరు కాంగ్రెస్ కార్యకర్తలు ధర్నా చేశారు. రాహుల్‌తో పాటు ర్యాలీలో ప్రియాంకా గాంధీ, మరికొంత మంది కాంగ్రెస్ నాయకులు పాల్గొన్నారు.
కాంగ్రెస్ పార్టీ ప్రధాన కార్యాలయం నుంచి ఈడీ ఆఫీసు వరకు ఈ ర్యాలీ జరిగింది. రాహుల్‌కు పోలీసులు పర్మిషన్ ఇవ్వలేదు. అయిన సరే రాహుల్ గాంధీ తన పార్టీ శ్రేణులతో కల్సి ఈడీ ఆఫీసు వరకు ర్యాలీ తీశారు. అనేక మంది కాంగ్రెస్ నేతల్ని వేరువేరు చోట్ల అరెస్టు చేశారు.