సిరిసిల్లా నియోజకవర్గం పరిధిలోని గంభీరావు పేట మండల కేంద్రం నుండి గౌరవ పురపాలక శాఖ మంత్రి శ్రీ కేటీఆర్ గారి అభిమానులు ఎగదండి రవి, గ్యార నగేష్, ఆవునూరి పరశురాములు తెలంగాణ రాష్ట్రంలో జరుగుతున్న అభివృద్ధి, అమలవుతున్న సంక్షేమ పథకాలకు కృతజ్ఞతగా ఈ నెల 11వ తేదీ నుండి హైదరాబాద్ ప్రగతిభవన్ వరకు పాదయాత్ర చేస్తున్నారు.
ఈ మేరకు కుత్బుల్లాపూర్ నియోజకవర్గం మీదుగా ఈరోజు వెళుతుండగా ఎమ్మెల్యే కేపి వివేకానంద్ గారు వారిని మార్గమధ్యలో ఘనంగా సన్మానించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే గారు మాట్లాడుతూ టీఆర్ఎస్ ప్రభుత్వ పనితీరు, రాష్ట్ర అభివృద్ధిలో గౌరవ మంత్రి కేటీఆర్ గారి చొరవను అభినందిస్తూ, రాష్ట్రంలో అమలవుతున్న పలు సంక్షేమ, అభివృద్ధి పథకాలకు కృతజ్ఞతగా అభిమానులు పాదయాత్ర చేయడం అభినందనీయం అన్నారు.
తెలంగాణ రాష్ట్రంలో అమలవుతున్న పథకాలు దేశంలో ఎక్కడా అమలుకావడం లేదని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో వారి వెంట గంభీరావు పేట మండల నాయకులు కమలాకర్ రెడ్డి, సోషల్ మీడియా వారియర్ అనిల్ రెడ్డి ఉన్నారు.