గుడివాడలో జరుగుతున్న అభివృద్ధి కార్యక్రమాలను కేంద్ర మాజీ మంత్రి పురందేశ్వరి అడ్డుకుంటున్నారని వైసీపీ సీనియర్ నేత, మాజీ మంత్రి కొడాలి నాని ఆరోపించారు. కేవలం 10 మంది వ్యాపారుల ప్రయోజనాల కోసం లక్షలాది మందికి ఉపయోగపడే రైల్వే గేట్లపై ఫ్లై ఓవర్ల నిర్మాణాన్నిఅడ్డుకోవడం దారుణమని విమర్శించారు. గుడివాడలో నిర్వహించిన మీడియా సమావేశంలో నాని మాట్లాడారు.
అన్న ఎన్టీఆర్ రెండుసార్లు ప్రాతినిధ్యం వహించిన గుడివాడలో అభివృద్ధి పనులను అడ్డుకోవద్దని విజ్ఞప్తి చేశారు. ఫ్లైఓవర్ల నిర్మాణం ఆగిపోతే గుడివాడ మీదుగా వెళ్లే రైళ్లను అడ్డుకుంటామని.. పురందేశ్వరి పిచ్చి ప్రయత్నాలు మానుకోవాలని హెచ్చరించారు.