తెలంగాణ రాష్ట్రంలో ఈ రోజు సోమవారం నుండి బడులు పునర్ ప్రారంభమైన సంగతి విదితమే. ఈ సందర్భంగా రాష్ట్ర విద్యాశాఖ మంత్రి శ్రీమతి పటోళ్ల సబితా ఇంద్రారెడ్డి మాట్లాడుతూ రాష్ట్రంలో ఉన్న అన్ని ప్రభుత్వ పాఠశాలల్లో ఇంగ్లిష్ మీడియంలో బోధన మొదలు పెట్టాము.. ప్రైవేట్ స్కూళ్లకు ధీటుగా సర్కారు బడులు ఉంటాయని అన్నారు.
మన ఊరు మనబడి కింద స్కూళ్లను అభివృద్ధి చేస్తున్నామని తెలిపారు. రూ.9 వేల కోట్లతో 26 వేల పాఠశాలల్లో సౌకర్యాలు కల్పిస్తున్నామన్నారు. బడులు ప్రారంభమైన సందర్భంగా మంత్రి సబితా ఇంద్రారెడ్డి హైదరాబాద్లోని మెహబూబియా స్కూల్కు వచ్చారు. విద్యార్థులకు చాక్లెట్లు ఇచ్చి వెల్ కమ్ చెప్పారు. అనంతరం మీడియాతో మాట్లాడుతూ.. మొదటి రోజు పాఠశాలలకు పిల్లలు ఉత్సాహంగా వచ్చారని చెప్పారు.