హిట్లు ఫ్లాప్‌లతో సంబంధం లేకుండా ప్రేక్షకులను కొత్త కథలతో ఎంటర్టైన్ చేయడంలో గోపిచంద్ ఎప్పుడు ముందు వరుసలో ఉంటాడు. దిగ్గజ దర్శకుడు టి. కృష్ణ తనయుడిగా ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చిన తన నటన, అభినయంతో ప్రేక్షకులలో ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నాడు. అటు కమర్షియల్ సినిమాలకు పెద్ద పీఠ వేస్తూనే మధ్య మధ్యలో కంటెంట్ సినిమాలను చేస్తున్నాడు. మొదట్లో ఈయన నుంచి సినిమా వస్తుందంటే ప్రేక్షకులు మరో ఆలోచన లేకుండా థియేటర్లకు వెళ్ళేవారు. అంతలా గోపించంద్ సినిమలు ప్రేక్షకులను ఆకట్టుకునేవి. ప్రస్తుతం ఈయన ఒక బ్లాక్ బస్టర్ హిట్ కోసం ఎంతగానో ఎదురు చూస్తున్నాడు. ఇటీవలే విడుదలైన సీటీమార్ ప్రేక్షకులను ఆకట్టుకున్నా గోపిచంద్‌కు మాత్రం కమర్షియల్ హిట్‌గా నిలవలేకపోయింది. ప్రస్తుతం ఈయన ఆశలన్ని పక్కా కమర్షియల్ పైనే. ఇదిలా ఉంటే ఆదివారం గోపిచంద్ పుట్టిన రోజు సందర్భంగా సోషల్ మీడియాలో బర్త్‌డే విషెస్ వెల్లు వెత్తుతున్నాయి.
ఈయన హిట్లు ఫ్లాప్‌ల గురించి పక్కన పెడితే.. నటుడిగా ఈయన స్థాయి ఎంటో తెలియాంటే ఈ ఎనిమిది సినిమాలు తప్పకుండా చూడాలి. గోపిచంద్ కెరీర్ బెస్ట్ పర్ఫార్మెన్స్ ఇచ్చిన 8 సినిమాలు ఎంటో ఓ లుక్కేద్దాం.
జయం:
‘తొలివలపు’ సినిమాతో హీరోగా కెరీర్ ప్రారంభించిన గోపిచంద్‌కు మొదటి సినిమానే తీవ్రంగా నిరాశపరిచింది. అంతేకాకుండా గోపిచంద్ నటనపై కూడా విమర్శలు వచ్చాయి. ఈ విషయాన్ని సీరియస్‌గా తీసుకున్న మ్యచో స్టార్ తన నటనను ఎలాగైనా ప్రూవ్ చేసుకోవాలని ‘జయం’ సినిమాలో విలన్‌గా నటించాడు. రఘు పాత్రలో ఈయన విలనిజం పండించిన తీరుకు విమర్శకులు సైతం ప్రశంసలు కురిపించారు. ఈ చిత్రం గోపిచంద్ కెరీర్‌నే మార్చేసింది.
నిజం:
‘జయం’ సినిమా విజయం తర్వాత గోపిచంద్‌కు విలన్‌గా అవకాశాలు క్యూ కట్టాయి. కానీ గోపిచంద్‌కు మాత్రం విలన్‌గా కంటిన్యూ అవడం ఇష్టంలేక విలన్ పాత్రలను రిజెక్ట్ చేసేవాడు. అయితే అప్పుడే తేజ మరో సారి పవర్ ఫుల్ విలన్ రోల్‌తో గోపిచంద్ దగ్గరకు వచ్చాడు. ఈ సారి గోపిచంద్ కాదనలేక ‘నిజం’ సినిమాలో విలన్‌గా చేసాడు. దేవుడు పాత్రలో గోపిచంద్ నటించాడు అనడం కంటే జీవించాడు అనడం సబబు. గోపిచంద్ నటుడిగా ఎంతటి ప్రావీణ్యుడో ఈ చిత్రం చూస్తే తెలుస్తుంది.
ఆంధ్రుడు:
‘యజ్ఞం’ సినిమాతో హీరోగా రీ ఎంట్రీ ఇచ్చిన ‘ఆంధ్రుడు’: మాత్రం గోపిచంద్‌ను హీరోగా నిలబెట్టింది. ఆరడుగుల కటౌట్‌కు పోలీస్ పాత్ర పడితే రిజల్ట్ ఎలా ఉంటుందో ఈ చిత్రం చూస్తే తెలుస్తుంది. కమర్షియల్‌గా ఈ చిత్రం భారీ విజయం సాధించకపోయినా ప్రేక్షకులను మాత్రం విపరీతంగా ఆకట్టుకుంది.
రణం:
గోపిచంద్‌కు కమర్షియల్ హిట్ ఇచ్చిన సినిమా ‘రణం’. ఈ చిత్రంతో గోపిచంద్ కామెడీ, మేనరిజం, యాటిట్యూడ్ వేరే లెవల్. మంచి నటుడికి సరైన స్క్రిప్ట్ పడితే రిజల్ట్ ఏ విధంగా ఉంటుందో ఈ చిత్రం నిరూపించింది. గోపిచంద్ కెరీర్లో గుర్తిండిపోయే చిత్రాలలో రణం ఒకటి.
ఒక్కడున్నాడు:
కమర్షియల్‌గా వరుస హిట్లతో దూసకుపోతున్న సమయంలో ‘ఒక్కడున్నాడు’ వంటి కాన్సెప్ట్ ఓరియెంటెండ్ సినిమా చేశాడు. ఫలితం గురించి పక్కన పెడితో ఈ సినిమాలో గోపిచంద్ నటన మరో స్థాయిలో ఉంటుంది. బాంబే బ్లడ్ గ్రూప్ నేపథ్యంలో తెరకెక్కిన ఈ సినిమాలో కిరణ్ పాత్రలో గోపిచంద్ నటన వర్ణనాతీతం. ఈ చిత్రంతో గోపిచంద్ నటుడిగా మరో మెట్టు ఎక్కాడు.
గోలీమార్:
గోపిచంద్ లాంటి హై ఎనర్జిక్ యాక్షన్ హీరో పూరి చేతిలో పడితే రిజల్ట్ ఏ రెంజ్లో ఉంటుందో ఈ చిత్రం నిరూపించింది. గంగారం పాత్రలో గోపిచంద్ నటనకు ప్రేక్షకులు ఫిదా అయ్యారు. గోపిచంద్ స్క్రీన్ మీద కనిపించే ఫస్ట్ ఫ్రేమ్ నుండి లాస్ట్ ఫ్రేమ్ వరకు హై ఎనర్జీతో ఉంటాడు. ఈ చిత్రంలో పోలీస్ పాత్ర నుంచి గ్యాంగ్‌స్టర్‌గా ట్రాన్స్ఫర్ అయిన తీరుకి ఎన్ని చప్పట్లు కొట్టినా తక్కువే.
సాహసం:
‘ఒక్కడున్నాడు’ కాంబో మరోసారి రిపీట్ అవుతుందంటే ప్రేక్షకులు తీవ్ర ఆసక్తితో ఎదురు చేశారు. ఇక ప్రేక్షకుల అంచనాలను ఏ మాత్రం డిసప్పాయింట్ చేయకుండా గోపిచంద్ తన నటనతో సినిమాను ఎక్కడికో తీసుకెళ్ళాడు. టాలీవుడ్లో చాలా కాలం తర్వాత ఒక పూర్తి స్థాయి ట్రెజర్ హంట్ సినిమాను ప్రేక్షకులకు చూపించాడు. ఒక విధంగా గోపిచంద్ ఈ చిత్రంలో అన్ని రకాల ఎమోషన్స్‌ను పండించాడు.
గౌతమ్‌నంద:
ఈ చిత్రంలో గోపిచంద్ డ్యూయల్ రోల్లో నటించాడు. రెండు క్యారెక్టరైజేషన్స్‌లో గోపిచంద్ నటుడిగా జీవించేశాడు. ఇక నెగెటీవ్ షేడ్స్ పాత్రలో తన నటన వేరే లెవల్. గోపిచంద్ కెరీర్లో బ్లాక్‌బస్టర్ హిట్టవాల్సిన సినిమా.. కానీ అప్పడున్న పరిస్థితుల్లో యావరేజ్‌గా నిలిచింది. ఇప్పటికే ఈ చిత్రం టీవీలో వస్తుందంటే ప్రేక్షకులు కన్నార్పకుండా చూస్తారు.
ఈ ఎనిమిది సినిమాలు చూస్తే చాలు గోపిచంద్ ఏ స్థాయి నటుడో తెలుస్తుంది. ప్రస్తుతం ఈయన మారుతి దర్శకత్వంలో ‘పక్కా కమర్షియల్’ చేస్తున్నాడు. యాక్షన్ కామెడీ ఎంటర్టైనర్గా తెరకెక్కిన ఈ చిత్రం జూలై 1న విడుదల కానుంది. ఈ చిత్రం తర్వాత శ్రీవాస్ దర్శకత్వంలో హ్యట్రిక్ చిత్రాన్ని చేయబోతున్నాడు.
Source : Namasthe Telangana