గవర్నర్ తమిళిసై ప్రజాదర్బార్ నిర్వహించడం ప్రజాస్వామ్య విరుద్ధమని.. రాజ్‌భవన్‌ను ఆమె రాజకీయ భవన్‌గా మార్చేశారని టీఆర్‌ఎస్ ఎమ్మెల్యే జీవన్‌రెడ్డి విమర్శించారు. అది ప్రజాదర్బార్ కాదని.. పొలిటికల్ దర్బార్ అని ఆరోపించారు. టీఆర్‌ఎస్‌ఎల్పీ కార్యాలయంలో నిర్వహించిన మీడియా సమావేశంలో జీవన్‌రెడ్డి మాట్లాడారు.
దేశంలోనే ఎక్కడా లేని సంప్రదాయాన్ని తమిళిసై తీసుకొస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. గవర్నర్ తమిళిసైకి రాజకీయాలు చేయాలని ఉంటే బండి సంజయ్ స్థానంలో బీజేపీ అధ్యక్షురాలిగా రావాలని ఆయన వ్యాఖ్యానించారు. గవర్నర్‌గా ఉండి రాజకీయాలు చేయడాన్ని టీఆర్‌ఎస్ వ్యతిరేకిస్తోందిన జీవన్‌రెడ్డి చెప్పారు.