టెన్త్ ఫలితాలపైనా టీడీపీ దిగజారుడు రాజకీయాలు చేస్తోందని ఏపీ మంత్రి ఆర్కే రోజా విమర్శించారు. తిరుమల శ్రీవారిని దర్శించుకున్న అనంతరం ఆమె మీడియాతో మాట్లాడారు. జనసేన అధ్యక్షుడు పవన్ కల్యాణ్ పార్టీ పెట్టింది జనం కోసమా? చంద్రబాబు కోసమా? అని ప్రశ్నించారు. చంద్రబాబుకు కష్టం వస్తే పవన్ ప్రెస్ మీట్ పెట్టడమో.. యాత్ర చేయడమో చేస్తారని చెప్పారు.
ఇప్పుడు బస్సు యాత్ర అంటూ వస్తున్నారని.. అది ఎందుకో ఆయనకైనా తెలుసా? అని రోజా ఎద్దేవా చేశారు. మహానాడులో తొడగొట్టి రమ్మని పిలిచిన టీడీపీ నేతలు.. లోకేష్ జూమ్ మీటింగ్‌కి కొడాలి నాని, వల్లభనేని వంశీ వస్తే ఎందుకు పారిపోయారని ప్రశ్నించారు. అచ్చెన్నకు టీడీపీపై కోపం ఉందని.. అందుకే మాట్లాడినప్పుడల్లా పార్టీని మూసేస్తామని అంటున్నారని వ్యాఖ్యానించారు.