దక్షిణ అమెరికాలోని కొలంబియాలో గుట్టల కొద్దీ బంగారం, ఇతర వస్తువులను అధికారులు గుర్తించారు. కొలంబియా దేశంలోని సముద్ర గర్భంలో గోల్డ్ కాయిన్స్‌ను భారీగా గుర్తించినట్లు అక్కడి అధికారులు వెల్లడించారు. గుర్తించిన బంగారం విలువ 17 బిలియన్ డాలర్లకు పైనే ఉంటుందని అంచనా వేస్తున్నారు. 17 బిలియన్ డాలర్లంటే ఎంతో తెలుసా.. ఇండియన్ క రెన్సీలో సుమారుగా 1.32లక్షల కోట్లు.
సుమారు 200 సంవత్సరాల క్రితం ఓ నౌక మునిగిపోయిందని.. ఆ నౌక కిందే ఇంత పెద్ద మొత్తంలో బంగారం గుర్తించామని కొలంబియా అధికారులు తెలిపారు. 1708లో స్పెయిన్ యుద్ధం జరిగిన సమయంలో ఈ ఘటన జరిగిందని చెప్పారు. నౌకను 2015లోనే గుర్తించినప్పటికీ.. అందులో ఏమున్నాయనే అంశంపై ఇప్పటి వరకు అన్వేషణ కొనసాగింది. ఎట్టకేలకు అందులో ఏమేం ఉన్నాయనేది కనుగొన్నారు.