ఏపీ ప్రధాన ప్రతిపక్ష పార్టీ తెలుగు దేశం పార్టీ అధినేత,మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, ఆ పార్టీకి చెందిన జాతీయ కార్యదర్శి,మాజీ మంత్రి,ప్రస్తుత ఎమ్మెల్సీ నారా లోకేష్ నాయుడు ఉన్మాదులుగా మారారని ఆ రాష్ట్ర అధికార పార్టీ అయిన వైసీపీకి చెందిన ఎంపీ విజయసాయి రెడ్డి విమర్శించారు.
‘అభివృద్ధి, సంక్షేమాలపై చర్చల ఊసే ఉండదు. ఎవరి ప్రాణాలు తీయాలా అని నిరంతరం స్కెచ్చులు వేస్తుంటారు. పార్టీ పునాదులు కదిలి క్షేత్రస్థాయిలో తుడిచి పెట్టుకుపోయింది. తండ్రీకొడుకులు (పెద్ద నాయుడు,చిన్న నాయుడు) ఉన్మాదులుగా మారి చివరకు స్కూల్ పిల్లలనూ వదలడం లేదు’ అని ట్వీట్ చేశారు.