తెలుగు సినిమా ఇండస్ట్రీకి చెందిన ప్రముఖ నిర్మాణ సంస్థలైన మైత్రి మూవీస్, శ్రేయస్ మీడియాపై తెలంగాణ రాష్ట్ర రాజధాని మహానగరం హైదరాబాద్ లోని మాదాపూర్ పోలీస్ స్టేషన్లో కేసు నమోదైంది. ఈ నెల 9వ తేదీన అంటే సుందరానికి అనే సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్‌ను మదాపూర్ శిల్పకళా వేదికలో మైత్రి మూవీస్, శ్రేయస్ మీడియా కలిసి నిర్వహించాయి.
ఈ ఈవెంట్‌కు ఆ సంస్థలు ఎలాంటి అనుమతి తీసుకోలేదు. దీంతో మాదాపూర్ పోలీసులు సుమోటోగా కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. అంటే సుందరానికి సినిమా నిన్న విడుదలైన సంగతి తెలిసిందే.ఈ చిత్రంలో నేచూరల్ స్టార్ హీరో నాని , నజ్రియా నజీమ్ , అనుపమా పరమేశ్వరన్ నటించారు. వివేక్ ఆత్రేయ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమాకు నిర్మాతలుగా నవీన్ యెర్నేని, వై రవి శంకర్ వ్యవహరించారు.