ప్రముఖ నటి నయనతార, దర్శకుడు విఘ్నేష్ శివన్ వివాహం ఘనంగా జరిగింది. మహాబలిపురంలోని ఓ హోటల్లో ఈ పెళ్లి వేడుక జరిగింది. హిందూ సంప్రదాయం ప్రకారం నయన్ మెడలో విఘ్నేష్ మూడు ముళ్లు వేశారు.
ఈ పెళ్లి వేడుకలో టాలీవుడ్, బాలీవుడ్ సహా వివిధ రంగాలకు చెందిన ప్రముఖులు హాజరయ్యారు. ప్రముఖ నటులు రజనీకాంత్, షారూక్‌ఖాన్ తదితరులు హాజరయ్యారు. నూతన దంపతులకు వాళ్లంతా మ్యారేజ్ విషెస్ చెప్పారు. నయనతార-విఘ్నేష్ శివన్ మ్యారేజ్ ఫొటోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి.