ప్రతి సంవత్సరం 2 లక్షల ఉద్యోగాలు ఇస్తామని ప్రధాని నరేంద్ర మోడీ గతంలో హామీ ఇచ్చారని.. అది ఏమైందని టీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మంత్రి కేటీఆర్ నిలదీశారు. ఈ మేరకు ప్రధానికి ఆయన లేఖ రాశారు.
కేంద్ర ప్రభుత్వంలో ఖాళీగా ఉన్న 16లక్షల ఉద్యోగాలను భర్తీ చేయాలని కేటీఆర్ డిమాండ్ చేశారు. తెలంగాణ ప్రభుత్వం ఇప్పటికే 1.32లక్షల జాబ్స్ భర్తీ చేసిందని.. త్వరలో మరో లక్ష చేస్తుందని చెప్పారు. ప్రైవేట్ రంగంలో 16లక్షల ఉద్యోగాలు కల్పించామని చెప్పారు. రాష్ట్రానికి కేటాయించిన ఐటీఐఆర్‌ను కేంద్రం రద్దు చేసి తెలంగాణకు పెద్ద దెబ్బ కొట్టారని కేటీఆర్ విమర్శించారు.