దేశంలో గత కొన్ని రోజులుగా కరోనా కేసులు రోజురోజుకు అధికమవుతున్నాయి. క్రమంగా పది వేలవైపు పరుగులు పెడుతున్నాయి. బుధవారం 5233 మంది పాజిటివ్‌లుగా నిర్ధారణకాగా, నేడు ఆ సంఖ్య 7240కి చేరింది. ఇది బుధవారం నాటికంటే 40 శాతం అధికమని కేంద్ర ఆరోగ్యశాఖ వెల్లడించింది. తాజా కేసులతో మొత్తం బాధితులు 4,31,97,522కు చేరారు. ఇందులో 4,26,40,301 మంది కరోనా నుంచి కోలుకున్నారు. ఇప్పటివరకు 5,24,723 మంది మృతిచెందారని తెలిపింది.
