ఖతర్ పర్యటనలో ఉన్న భారత ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడిని తీవ్ర అవమానానికి గురిచేశాయి.దీనికి ప్రధాన కారణం మహమ్మద్ ప్రవక్తపై బీజేపీ నేతల వ్యాఖ్యలు . అర్ధ శతాబ్దానికి పైగా మంచి మిత్ర దేశంగా ఉన్న ఖతర్‌తో స్నేహ సంబంధాలపై నీలినీడలు కమ్ముకొన్నాయి. యాభై ఏండ్ల దౌత్య సంబంధాలకు ప్రతీకగా జరుగుతున్న పలు కార్యక్రమాల్లో పాల్గొనేందుకు ఖతర్‌కు వెళ్లిన ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడిని కలవడానికి ఖతర్ ఎమిర్ అయిన అమీర్ షేక్ అబ్దుల్లా బిన్ అహ్మద్ ఇష్టపడలేదు.
ఇద్దరి మధ్య ముందుగా నిర్ణయించిన విందు సమావేశం అర్ధాంతరంగా రద్దు అయింది. వైద్య కారణాల వల్ల విందు సమావేశం రద్దు చేసుకొంటున్నట్టు ఖతర్ అధికార వర్గాలు భారత ప్రభుత్వానికి సమాచారం అందించాయి. దీంతో సమావేశం అనంతరం ఇద్దరు నేతల సంయుక్త మీడియా సమావేశం కూడా రద్దయినట్టు వెల్లడించాయి.
పేరుకు వైద్య కారణాలు చెప్తున్నప్పటికీ.. అసలు కారణం మాత్రం భారత్‌లో బీజేపీ నేతలు మహ్మద్ ప్రవక్తపై చేసిన వ్యాఖ్యలే కారణమని అర్థమవుతున్నది. ఆదివారం ఖతార్ ప్రధాని ఖలీద్ బిన్ ఖలీఫా బిన్ అబ్దుల్‌అజీజ్ ఆల్ థానీ, మంత్రి షేక్ ఖలీద్ బిన్ ఖలీఫాతో భేటీ అయిన వెంకయ్యతో డిప్యూటీ ఎమిర్ మాత్రం సమావేశం కాలేకపోయారు. ఒక పక్క వెంకయ్య ఖతర్ పర్యటనలో ఉండగానే.. మరో పక్క అక్కడి ప్రభుత్వం భారత దౌత్యవేత్తకు సమన్లు ఇచ్చి భారత్‌లో బీజేపీ నేతల వ్యాఖ్యలపై తీవ్ర అసంతృప్తిని వ్యక్తం చేసింది. భారత ప్రభుత్వం బహిరంగంగా క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేసింది.