గవర్నమెంట్ డాక్టర్ల అంశంలో తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు ఓ జీవోను వైద్య ఆరోగ్యశాఖ విడుదల చేసింది. కొత్తగా ఉద్యోగాల్లో చేరే డాక్టర్లు ప్రైవేట్ ప్రాక్టీస్‌ను నిషేధించింది. ఇది వరకే ప్రభుత్వ డాక్టర్లుగా ఉన్నవాళ్లు తమ ప్రైవేట్ ప్రాక్టీస్‌ను కొనసాగించుకోవచ్చని జీవోలో పేర్కొన్నారు.
ఈ మేరకు మెడికల్ ఎడ్యుకేషన్ రూల్స్‌ను ప్రభుత్వం సవరించింది. త్వరలో రాష్ట్రంలో డాక్టర్లు, స్టాఫ్ నర్సులు సహా ఇతర సిబ్బందిని నియమించనున్నారు. ఈ నేపథ్యంలో నియామక షెడ్యూల్ గైడ్‌లైన్స్‌లో గవర్నమెంట డాక్టర్ల ప్రైవేట్ ప్రాక్టీస్ రద్దు అంశాన్ని చేర్చారు.