జనసేన అధినేత పవన్ కల్యాణ్‌కు ప్రజాశాంతి పార్టీ అధ్యక్షుడు కేఏ పాల్ బంపరాఫర్ ఇచ్చారు. పవన్ కల్యాణ్ తన పార్టీలో చేరితే ఎంపీ, ఎమ్మెల్యే.. ఈ రెండింట్లో ఏదో ఒకటి అయ్యేలా చేస్తామన్నారు. అలా చేయకపోతే రూ.వెయ్యికోట్లు ఇస్తానని చెప్పారు.
ఓ న్యూస్ ఛానల్‌తో మాట్లాడుతూ కేఏ పాల్ ఈ విధంగా వ్యాఖ్యానించారు. పవన్ కల్యాణ్ ఏ పార్టీతో పొత్తు పెట్టుకున్నా గెలవరన్నారు. ప్రజాశాంతి పార్టీలో ఏ పదవి కావాలన్నా ఆయనకు ఇస్తామని చెప్పారు.