తెలంగాణ రాష్ట్ర బీజేపీ కి చెందిన నేత.. గోషామహల్ అసెంబ్లీ నియోజకవర్గ ఎమ్మెల్యే రాజాసింగ్‌పై రాష్ట్ర రాజధాని మహానగరం హైదరాబాద్ లోని కంచన్‌బాగ్ పోలీసు స్టేషన్‌లో కేసు నమోదైంది.
బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్ ఉద్ధేశ్యపూర్వకంగానే మతాల మధ్య చిచ్చు పెట్టాలనే అజ్మీర్ దర్గాపై అనుచిత వ్యాఖ్యలు చేశారన్న స్థానికుడి ఫిర్యాదుతో కేసు నమోదు చేసినట్లు పోలీసులు వెల్లడించారు.
అయితే ఎమ్మెల్యే రాజాసింగ్ చేసిన వ్యాఖ్యలు యూట్యూబ్‌లో వైరల్ అయ్యాయి. ఈ వీడియో ఆధారంగా రాజాసింగ్‌పై పోలీసులకు ఫిర్యాదు చేయగా, కేసు నమోదు చేశారు. ఐపీసీ సెక్షన్ 295ఏ కింద కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.