తెలంగాణ రాష్ట్ర బీజేపీకి చెందిన నేత… దుబ్బాక అసెంబ్లీ నియోజకవర్గ ఎమ్మెల్యే రఘునందన్ రావుపై హైదరాబాద్ మహానగరంలోని అబిడ్స్ పోలీసు స్టేషన్లో కేసు నమోదు అయింది. జూబ్లీహిల్స్ అమ్నీషియా పబ్ సామూహిక లైంగికదాడి ఘటనలో బాలిక ఫోటోలు, వీడియోలను రఘునందన్ రావు బీజేపీ ఆఫీసులో విడుదల చేశారు.
దీంతో ఆయనపై ఐపీసీ సెక్షన్ 228ఏ కింద కేసు నమోదు చేసినట్లు పోలీసులు వెల్లడించారు.బాలిక వీడియోలను బహిర్గతం చేయటంలో కీలకంగా వ్యవహారించిన పాతబస్తీకి చెందిన సుభాన్ అనే వెబ్ రిపోర్టర్‌కు సీసీఎస్ సైబర్ క్రైమ్ పోలీసులు ఇప్పటికే నోటీసులు జారీ చేశారు.
అఘాయిత్యానికి గురైన బాధితుల వివరాలు బయటకు రావొద్దని సుప్రీం కోర్టు ఆదేశాలున్నా, కారులోని వీడియోలను ఫేస్బుక్లో పోస్టు చేయటంతో పోలీసులు కేసు నమోదు చేశారు. వీడియోలు ఎవరు తీశారు? ఎందుకు తీశారు? ఎలా బయటకు వచ్చాయనే విషయాలపై స్పష్టత వచ్చాక బాధ్యులపై చర్యలు తీసుకొనేందుకు పోలీసులు సిద్ధమయ్యారు.