టీడీపీలో జరుగుతున్న విషయాలన్నీ త్వరలో బయట పెడతానని ఇటీవల ఆ పార్టీకి రాజీనామా చేసిన మహిళా నేత, సినీనటి దివ్యవాణి అన్నారు. తెలుగుదేశంలో ఇప్పటికీ ఎంతోమంది మహిళా నేతలు ఇబ్బంది పడుతున్నారని చెప్పారు. ఈ మేరకు ఆమె ఓ వీడియో విడుదల చేశారు.
ఇన్నాళ్లు ఏం జరిగిందో అన్నింటికీ తన వద్ద ఆధారాలు ఉన్నాయన్నారు. తాను చెప్పే నిజాలను చూపించే ధైర్యం ఏబీఎన్, టీవీ 5కి ఉన్నాయా? అని దివ్యవాణి ప్రశ్నించారు. టీడీపీ విశ్లేషకుల పేరుతో కొంతమంది తప్పుడు ప్రచారం చేస్తున్నారని ఆమె విమర్శించారు.