ఏపీ ముఖ్యమంత్రి,అధికార వైసీపీ అధినేత వైఎస్ జగన్మోహాన్ రెడ్డికి ఆ పార్టీకి చెందిన ఎమ్మెల్యే షాకిచ్చారు. ఈ క్రమంలో రాష్ట్రంలోని విశాఖ దక్షణ నియోజకవర్గ సమన్వయకర్త పదవి నుంచి తాను వైదొలుగుతున్నట్లు ఎమ్మెల్యే వాసుపల్లి గణేష్ కుమార్ తెలిపారు.
దీనికి సంబంధించి ఆయన ఉత్తరాంద్ర జిల్లాల సమన్వయకర్త వై.వి సుబ్బారెడ్డికి, నగర అధ్యక్షుడు అవంతి శ్రీనివాస్‌కు లేఖ రాశారు. సమన్వయకర్తగా బాధ్యతలు చేపట్టిన తొలి రోజే తనకు బలనిరూపణ పెట్టడం తన గౌరవానికి భంగం కలిగించింది. అలాగే వ్యక్తిగత కారణాల వల్ల పదవి నుంచి తప్పుకుంటున్నానని లేఖలో పేర్కొన్నారు.