యూపీలో మంకీ ఫాక్స్ వైరస్ కలకలం రేగింది. ఘజియాబాద్‌కు చెందిన ఐదేళ్ల బాలికలో ఆ వ్యాధి లక్షణాలు కనిపించడంతో అక్కడి అధికారులు అప్రమత్తమయ్యారు. చేతిపై దద్దుర్లు, దురద రావడంతో ఆమెను వెంటనే ఆస్పత్రికి తరలించి చికిత్స ప్రారంభించారు. బాధిత బాలిక నుంచి శాంపిల్స్‌ను సేకరించి పుణెలోని ల్యాబ్‌కు పంపించారు.
ఇటీవల కాలంలో ఆ బాలిక కుటుంబం ఎలాంటి విదేశీ పర్యటనలు కూడా చేయకపోయినా మంకీఫాక్స్ తరహా లక్షణాలు రావడంతో అక్కడ ఆందోళన నెలకొంది. అయితే ఇది ముందు జాగ్రత్తగా తీసుకుంటున్న చర్యలేనని.. ప్రజలెవరూ ఆందోళన చెందాల్సిన అవసరం లేదని అధికారులు పేర్కొన్నారు.