మహబూబ్‌నగర్ జిల్లాలో పలు అభివృద్ధి పథకాలకు మంత్రి కేటీఆర్ శంకుస్థాపన, ప్రారంభోత్సవాలు చేశారు. జిల్లా పర్యటనలో భాగంగా దేవరకద్ర, భూత్పూర్, కోసిగి తదితర ప్రాంతాల్లో ఆయన పర్యటిస్తున్నారు. దేవరకద్ర మండలం వెంకపల్లిలో రూ.55కోట్ల వ్యయంతో చేపట్టనున్న పేరూరు లిఫ్ట్ ఇరిగేషన్ స్కీమ్‌కు కేటీఆర్ శంకుస్థాపన చేశారు.
వర్ని-ముత్యూలపల్లి రోడ్డుపై వంతెన, గుడిబండకు రోడ్డు నిర్మాణ పనులను మంత్రి ప్రారంభించనున్నారు. ఆ తర్వాత భూత్పూర్ చేరుకుని మున్సిపాలిటీలో మినీ స్టేడియం నిర్మాణానికి ఆయన శంకుస్థాన చేస్తారు. ఆ తర్వాత కోసిగిలో నిర్వహించనున్న బహిరంగ సభలో కేటీఆర్ పాల్గొంటారు.