కుత్బుల్లాపూర్ నియోజకవర్గం, చింతల్ 128 డివిజన్ పరిధిలోని రొడా మేస్త్రి నగర్ ఏ కు చెందిన హాజీఅలీ ఈద్గా కమిటీ సభ్యులు ఈరోజు ఎమ్మెల్యే కేపి వివేకానంద్ గారిని తన నివాసం వద్ద మర్యాదపూర్వకంగా కలిశారు.
ఈ సందర్భంగా ఈద్గా మరియు గ్రేవియార్డు కొరకు స్థలం కేటాయించాలని కోరుతూ ఎమ్మెల్యే గారికి వినతి పత్రాన్ని అందజేశారు. ఈ మేరకు ఎమ్మెల్యే గారు సానుకూలంగా స్పందించి వెంటనే సంబంధిత అధికారులతో ఫోన్ లో మాట్లాడారు.
త్వరలోనే అందుకు కృషి చేస్తానని కమిటీ సభ్యులకు హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో ఈద్గా కమిటీ అధ్యక్షుడు మక్సూద్, యునుస్, ఖాదర్, నశీర్, మొహమ్మద్, రషీద్ పాల్గొన్నారు.