హైదరాబాద్‌లో స్విగ్గీ డెలివరీ బాయ్‌పై ఓ హోటల్ మేనేజ్మెంట్ దౌర్జన్యంగా ప్రవర్తించింది. ఈ ఘటన గచ్చిబౌలి పోలీస్‌స్టేషన్ పరిధిలో చోటుచేసుకుంది. ఫుడ్ డెలివరీ కోసం అక్కడికి వెళ్లిన బాయ్.. అరగంట పాటు వెయిట్ చేశారు. ఎందుకు ఆలస్యమవుతోందని హోటల్ మేనేజ్మెంట్ను ప్రశ్నించడంతో అక్కడకున్న సిబ్బంది రాడ్లు, కర్రలతో ఎటాక్ చేశారు. దీంతో స్విగ్గీ డెలివరీ బాయ్‌కి గాయాలయ్యాయి.
విషయం తెలుసుకున్న పోలీసులు అక్కడికి చేరుకుని బాధితుడిని హాస్పిటల్‌కి పంపించారు. హోటల్ యజమానిపై పోలీసులు కేసు నమోదు చేశారు. మరోవైపు డెలివరీ బాయ్‌కి న్యాయం చేయాంలూ స్విగ్గీ డెలివరీ బాయ్స్ ఆందోళనకు దిగారు. హోటల్ మేనేజ్మెంట్ వ్యవహరించిన తీరుపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. యజమానిపై పోలీసులు కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.