తెలంగాణ రాష్ట్ర అవతరణ దినోత్సవాన్ని పురస్కరించుకొని నగర, జిల్లా మరియు రాష్ట్ర ప్రజలకు శుభాకాంక్షలు తెలిపిన గౌ.ఎమ్మెల్యే గణేష్ బిగాల …ఎమ్మెల్యే గణేష్ బిగాల గారు మాట్లాడుతూ…తెలంగాణ రాష్ట్ర సాధనలో అమరులైన వీరులందరికి శిరస్సు వంచి నమస్కరిస్తున్నాను…వారి ప్రాణత్యాగనికి విలువణిస్తూ, పట్టువదలని విక్రమార్కుడిలా, తన ప్రాణాలనూ సైతం పణంగా పెట్టి తెలంగాణ రాష్ట్ర సాధనకై అన్ని వర్గాలను ఏకతాటిపై నడిపించి స్వరాష్ట్రం సాదించిపెట్టి, అన్నిరంగాల్లో వెనక్కి నెట్టబడిన తెలంగాణను ఈ ఎనమిది ఏళ్లలో యావత్ ప్రపంచం మన వైపు చూసేలా అభివృద్ధి చేస్తూ, బంగారు తెలంగాణ గా మలుస్తున్న గౌరవ ముఖ్యమంత్రి వర్యులు శ్రీ కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారికి ఈ సందర్భంగా మనఅందరి తరపున కృతజ్ఞతలు మరియు రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవ శుభాకాంక్షలు.
అనంతరం..నగరంలో నిర్వహించిన కార్యక్రమాలలో జిల్లా గౌ.మంత్రివర్యులు శ్రీ ప్రశాంత్ రెడ్డి గారితో కలసి గౌ. ఎమ్మెల్యే శ్రీ గణేష్ బిగాల గారు పాల్గొన్నారు.ముందుగా మునిసిపల్ కార్పొరేషన్ లో జాతీయ జండా ఆవిష్కరణ కార్యక్రమంలో మువ్వన్నెల జండావందనం చేశారు.అనంతరం వినాయక్ నగర్ లోని అమరవీరుల పార్క్ లో తెలంగాణ రాష్ట్ర సాధనలో ప్రాణత్యాగం చేసిన వీరులను స్మరించుకుని అమరవీరుల స్థూపం వద్ద నివాళి అర్పించి, పోలీస్ పరేడ్ గ్రౌండ్స్ లో త్రివర్ణ పతాకానికి గౌరవ వందనం చేసారు.
ఈ కార్యక్రమంలో TSRTC చైర్మన్ రురల్ ఎమ్మెల్యే శ్రీ బాజిరెడ్డి గోవర్ధన్ గారు,తెరాస జిల్లా అధ్యక్షులు ఆర్మూర్ ఎమ్మెల్యే శ్రీ ఆశన్నగారి జీవన్ రెడ్డి గారు, జిల్లా కలెక్టర్ శ్రీ నారాయణరెడ్డి,అదనపు కలెక్టర్ మరియు మునిసిపల్ ఇంచార్జి కమిషనర్ శ్రీ చిత్ర మిశ్రా గారు, నగర మేయర్ శ్రీమతి దండు నీతూ కిరణ్ గారు, జిల్లా పరిషత్ చైర్మన్ శ్రీ దాదన్నగారి విట్టల్ రావు గారు, నుడ ఛైర్మన్ శ్రీ ప్రభాకర్ రెడ్డి గారు, MLC శ్రీ రాజేశ్వర్ గారు,NDCCB చైర్మన్ శ్రీ పోచారం భాస్కర్ రెడ్డి గారు, రెడ్కో చైర్మన్ SA అలీం గారు, కార్పొరేటర్లు మరియు తెరాస నాయకులు ఉన్నారు.