గతకొంతకాలంగా టీడీపీలోని అన్ని కార్యక్రమాలకు తనను దూరం పెడుతున్నారని.. పార్టీలో అవమానాలు తట్టుకోలేకే రాజీనామా చేసినట్లు సినీనటి దివ్యవాణి తెలిపారు. టీడీపీకి రాజీనామా చేసినట్లు తొలుత వీడియో సందేశం ద్వారా ప్రకటించిన ఆమె.. గురువారం ఉదయం ప్రెస్మీట్ నిర్వహించి జరిగిన పరిణామాలను, తనకు ఎదురైన అనుభవాలను వివరించారు. కనీసం ప్రెస్మీట్ పెట్టేందుకు కూడా ఎవరూ తనకు సహకరించలేదన్నారు. ఈ విషయాలపై చంద్రబాబును కలిసి వివరిద్దామనుకున్నా ఆయన్ను కలవనివ్వలేదని చెప్పారు.
