తెలంగాణలో పేద ప్రజల సంక్షేమం కోసం పూర్తి భరోసానిస్తున్న ఏకైక ప్రభుత్వం తెలంగాణ ప్రభుత్వమని తెరాస వరంగల్ జిల్లా అధ్యక్షులు, వర్ధన్నపేట ఎమ్మెల్యే అరూరి రమేష్ గారు తెలిపారు.
వర్ధన్నపేట నియోజకవర్గ పరిధిలోని గ్రేటర్ వరంగల్ హాసన్ పర్తి ఎర్రగట్టుగుట్ట కు చెందిన చకిలం చంద్రశేఖర్ గారికి ముఖ్యమంత్రి సహాయ నిధి నుండి 1లక్ష రూపాయలు మంజూరు కాగా ఎమ్మెల్యే అరూరి రమేష్ గారు స్వయంగా లబ్ధిదారుని ఇంటికి వెళ్లి చెక్కును అందజేశారు.
ఈ సందర్బంగా ఎమ్మెల్యే గారు మాట్లాడుతూ తెలంగాణ ప్రభుత్వం బడుగు, బలహీన వర్గాల సంక్షేమం, ఆరోగ్యం పట్ల పూర్తి భరోసా కల్పిస్తోందని అన్నారు. ప్రాణాపాయ స్థితిలో ఉన్న నిరుపేదలకు తెలంగాణ ప్రభుత్వం ముఖ్యమంత్రి సహాయ నిధి ద్వారా చికిత్సకు తగిన ఆర్థిక సాయం అందిస్తోందని పేర్కొన్నారు.
సీఎం రిలీఫ్ ఫండ్ ద్వారా రాష్ట్రవ్యాప్తంగా ఎందరో నిరుపేదల ప్రాణాలు నిలబడుతున్నాయని అన్నారు. రాష్ట్రంలో వైద్యం, విద్యకు సీఎం కేసీఆర్ పెద్దపీట వేస్తున్నారని, రాష్ట్రంలో అనారోగ్యంతో బాధపడుతున్న వారు భయపడవద్దని ప్రభుత్వం తరపున ఆర్ధిక సహాయం అందిస్తామని ఎమ్మెల్యే గారు భరోసా ఇచ్చారు. ఈ కార్యక్రమంలో స్థానిక నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.